Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ (Delhi Airport)లో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ రన్‌వే (Take Off Runway)పై ఓ విమానం ల్యాండ్ అయ్యింది. అయితే, ఆ సమయంలో టేకాఫ్‌లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
అఫ్ఘానిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం FG 311, అరియాన ఎయిర్‌బస్ (Ariana Airlines Flight) ఏ310 ఆదివారం మధ్యాహ్నం 12:09 గంటల సమయంలో కాబూల్ (Kabul) నుంచి ఢిల్లీకి వచ్చింది. రన్‌వే 29 ఎల్పై ల్యాండింగ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది. అయితే, బదులుగా విమానం టేకాఫ్ రన్‌వే అయిన 29ఆర్‌పై దిగింది. ఆ సమయంలో టేకాఫ్‌లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనపై విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టేకాఫ్ రన్‌వేపై విమానం ల్యాండ్ కావడానికి సమాచార లోపం లేదా ఇంకేదైనా ఉందా అన్నదానిపై విచారణ చేస్తున్నారు.
Also Read..
Two Buses Collide | రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి
Delhi Pollution | ఢిల్లీ పోలీసులపై పెప్పర్ స్ప్రే.. 22 మంది అరెస్ట్
Operation Crystal Fortress | ఢిల్లీలో కలకలం.. ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం