Operation Crystal Fortress | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో కోట్ల రూపాయల విలువ చేసే మెధాంపైటమైన్ను ఎన్సీబీ (Narcotics Control Bureau) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
‘ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్’ (Operation Crystal Fortress) పేరుతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) అధికారులు, ఢిల్లీ పోలీసులు (Delhi Police) సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఛత్రపుర్లోని ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన 329 కిలోల మెధాంపైటమైన్ (methamphetamine)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ రవాణా ముఠాకు విదేశీ ఆధారిత కింగ్పిన్తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. విదేశీ హ్యాండ్లర్ల సూచనలతో నిందితులు డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేస్తున్నారని.. వారితో సంప్రదింపుల కోసం ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
IndiGo | ల్యాండింగ్ సమయంలో విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. దెబ్బతిన్న ముందుభాగం
Justice Surya Kant | 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
Ozone Pollution | డేంజర్ బెల్స్.. ఓజోన్ కాలుష్యంతో ఊపిరితిత్తులకు ముప్పు..!