Bangladesh : పొరుగదేశమైన బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందువుల (Hindus) పై దాడులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో దాడి జరిగింది. కూమిల్లా (Coomilla) ప్రాంతంలో పూజ చేస్తున్న హిందువుల బృందంపై శనివారం గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అకస్మాత్తుగా హిందువుల గుంపుపై బాంబులు (Bombs) విసిరారు. దాంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ఈ బాంబు దాడిలో ఆ పూజా కార్యక్రమానికి హాజరైన పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో గాయపడిన పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య జరిగినప్పటి నుంచి ఆ దేశంలోని హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు.