Nitish Kumar | జేడీయూలోకి నితీష్ తనయుడు నిశాంత్.. బిహార్ డిప్యూటీ సీఎంగా ఎన్నిక..?
Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతల మధ్య జేడీయూ కండువా కప్పుకొన్నారు.
Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ సొంత పార్టీ జేడీయూలో చేరారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతల మధ్య జేడీయూ కండువా కప్పుకొన్నారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం అయిన నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని ఎవరు నడిపిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీని నడిపించేందుకే నిశాంత్‌ను నితీష్ రాజకీయాల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది.
నిశాంత్ వయసు 50. సాధారణంగా నితీష్ కుమార్ లాంటి అగ్రనేతలు తమ వారసుల్ని చిన్న వయసులోనే రాజకీయాలకు తీసుకొస్తుంటారు. కానీ, నిశాంత్‌ను మాత్రం నితీష్ రాజకీయాలకు దూరంగా ఉంచారు. కారణం.. నితీష్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమనే ప్రచారం ఉంది. అయితే, ప్రస్తుతం నితీష్ రాష్ట్రాన్ని వదిలి కేంద్రానికి వెళ్తుండటంతో, తప్పనిసరిగా రాష్ట్ర బాధ్యతలు చూసేందుకు నిశాంత్‌ను పార్టీలోకి తీసుకొచ్చారు. నిశాంత్ కూడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలని చూడలేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. సీఎం కొడుకైనప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే రాజకీయ వేదికలపై కనిపించేవారు. జేడీయూలో చేరిన నిశాంత్‌కు బిహార్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. నిశాంత్‌కు బిహార్ డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
జేడీయూలో చేరిన సందర్భంగా నిశాంత్ మాట్లాడుతూ పార్టీని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన తండ్రి నితీష్ రాజ్యసభకు వెళ్లాలన్నది ఆయన సొంత నిర్ణయమని, దాన్ని గౌరవిస్తానన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం కోసం పనిచేస్తానని వెల్లడించారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో నితీష్ గెలవడం లాంఛనమే. రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన తర్వాత నితీష్ బిహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

