Justice Surya Kant | 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice Of India) జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ (BR Gavai) పదవీకాలం ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే 15 నెలల పాటూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
#WATCH | Delhi: Justice Surya Kant takes oath as the Chief Justice of India, at Rashtrapati Bhavan. President Droupadi Murmu administers the oath to him.
(Video: DD News) pic.twitter.com/ZGpcknj7G8
— ANI (@ANI) November 24, 2025
సూర్యకాంత్‌ను సీజేఐగా నియమించాలని జస్టిస్ గవాయ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. భారత రాజ్యాంగంలోని అధికారాలను వినియోగించి జస్టిస్ సూర్యకాంత్‌ను సీజేఐగా నియమించడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన సూర్యకాంత్ ఓ మధ్య తరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం మాస్టర్స్ డిగ్రీలో టాపర్‌గా నిలిచారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.
#WATCH | Delhi: CJI Surya Kant shares a hug with his predecessor, former CJI BR Gavai, as they greet each other. Justice Surya Kant took oath as the 53rd Chief Justice of India today.
(Video: DD News) pic.twitter.com/kUPRhjZzGC
— ANI (@ANI) November 24, 2025
హర్యానాకు చెందిన జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. న్యాయపరమైన తర్కానికి, సామాజిక న్యాయంపై బలమైన ప్రాధాన్యతకు పేరుగాంచిన ఆయన రాజ్యాంగ ధర్మాసనంలోని అనేక విషయాలలో, పాలన, పర్యావరణ సమస్యలు, రాజ్యాంగ వివరణలపై కీలక తీర్పులలో భాగంగా ఉన్నారు. 15 నెలల పాటు సీజేఐగా ఉండనున్న ఆయన ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ జస్టిస్, డిజిటల్ ప్రైవసీ వంటి ప్రధాన రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులలో భాగస్వామి కానున్నారు.
Also Read..
బిల్లులను గవర్నర్లునిరవధికంగా తొక్కిపెట్టరాదు!
సింధ్ మళ్లీ భారత్‌లో కలవొచ్చు!
ఆర్టికల్ 240 పరిధిలోకి చండీగఢ్.. కేంద్రం చేతిలోకి పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని!