న్యూఢిల్లీ : ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్ ప్రాంతం తిరిగి భారత్‌లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో దేశ విభజన జరిగినపుడు, ఇండస్ నదితోపాటు సింధ్ పాకిస్థాన్‌కు వెళ్లిందన్నారు.
సింధీ ప్రజలు పెద్ద సంఖ్యలో భారత దేశానికి వచ్చారని తెలిపారు. భారత దేశం నుంచి సింధీ ప్రాంతం వేరుపడటాన్ని సింధీ హిందువులు అంగీకరించలేదని మాజీ ఉప ప్రధాన మంత్రి అద్వానీ తన పుస్తకంలో రాశారని చెప్పారు.