న్యూఢిల్లీ : రాజ్యాంగం అనుమతించనందున రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించడాన్ని ఆపేశామని, అదే సమయంలో గవర్నర్లు బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచరాదని స్పష్టంగా చెబుతూ సుప్రీం కోర్టు సమతుల్యమైన తీర్పును ఇచ్చిందని సీజేఐగా ఆదివారం పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియమకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థను గట్టిగా సమర్థించారు. షెడ్యూల్డ్ కులాల కోటాలో సంపన్నులను మినహాయించడాన్ని కూడా ఆయన మద్దతు పలికారు.