IndiGo | ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది (Bird Hit). ఈ ఘటనలో విమానం ముక్కు భాగం దెబ్బతిన్నది (IndiGo plane damaged). అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
ఇండిగో విమానం IGO 5032 ఆదివారం సాయంత్రం ముంబై నుంచి ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ (Rishikesh)కు బయల్దేరింది. సాయంత్రం 6:45 గంటల సమయంలో డెహ్రాడూన్‌లోని రిషికేశ్ సమీపంలో గల జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ (Jolly Grant Airport)లో ల్యాండ్ అవుతోంది. ఆ సమయంలో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమానం ముక్కుభాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 186 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు (passengers safe). వారంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. ఆ తర్వాత తనిఖీలు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
Also Read..
Justice Surya Kant | 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
Ozone Pollution | డేంజర్ బెల్స్.. ఓజోన్ కాలుష్యంతో ఊపిరితిత్తులకు ముప్పు..!
ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీదే హవా..