దండేపల్లి, మార్చి 1 : ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం నేపధ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గల్ఫ్ వలస జీవుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తుండం, ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలపై ప్రతి దాడులకు పాల్పడుతుండడంతో యుద్ధ వాతావరణం నెలకొన్నది. సోషల్ మీడియాలో యుద్ధంపై వస్తున్న వార్తలు ఆందోళన పెంచుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, లాంచర్లు దూసుకొస్తాయేమోనని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. పొట్టచేత పట్టుకొని ఉపాధి కోసం వెళ్లిన జిల్లావాసుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొన్నది. వందలాది మంది అక్కడి దేశస్తులు మృతి చెందుతున్నట్లు టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు వెలువడడంతో ప్రవాసీ భారతీయుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 70 వేల మందికి పైగా పారిశ్రామిక, నిర్మాణ, ఉపాధి, ఇండ్ల్ల పనులు చేస్తున్నారు.
పనిచేస్తున్న ప్రదేశంలో బాంబులు పడుతున్నాయి..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట, గుడిరేవు జన్నారం మండలాల్లోని తపాల్పూర్, రాంపూర్, రోటిగూడ గ్రామాలకు చెందిన పలువురు ఉపాధి నిమిత్తం వెళ్లారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని వివరిస్తూ ‘నమస్తే’తో ఫోన్లో మాట్లాడారు. దుబాయ్ అబుదాబిలోని ఐలాండ్ ప్రాంతంలో గల సముద్రతీర ప్రదేశంలో పనిచేస్తున్న ఎర్రం సత్తయ్య తన కంపెనీ మిత్రులతో కలిసి పని చేస్తున్నాడు. ఈ సమయంలో బాంబులు పడడంతో అప్రమత్తమైన కంపెనీ యజమానులు కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారని తెలిపాడు. ఇక ఇజ్రాయిల్‌లో ఉంటున్న కార్మికుల పరిస్థితి అదే విధంగా ఉంది. రెండు రోజుల నుంచి బాంబుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సురక్షిత ప్రదేశంలో తలదాచుకుంటున్నామన్నారు. 10-15 నిమిషాల ముందు సైరన్ మోగిస్తున్నారని, అప్రమత్తమై వెంటనే బంకర్లలోకి వెళ్లిపోతున్నామని అన్నారు. ఏదైనా మిసైల్, యుద్ధ రాకెట్లు దూసుకొస్తున్న సమయంలో అధికారులు సైరన్ మోగిస్తున్నారని, సమీప ప్రాంతాల వారందరం సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నామని తెలిపారు. రాత్రివేళల్లో ఎక్కువగా రాకెట్లు, మిసైళ్లు దూసుకొస్తున్నాయిని, బంకర్లు ఉండడంతోనే ప్రమాదం నుంచి బయటపడుతున్నామని అంటున్నారు. ఇండియన్ ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నదని, సేఫ్టీ జోన్లో ఉండాలని సూచిస్తుందని పేర్కొంటున్నారు.
అప్రమత్తం చేస్తున్న భారత ఎంబసీలు..
దుబాయ్, సౌది అరేబియా, కువైట్, బహ్రేయిన్, ఖతార్, యూఏఈ, జోర్డాన్, అబుదాబి, ఇజ్రాయి ల్ దేశాల్లో ఉన్న భారతీయులు అత్యంత జాగ్ర త్తగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చిన సూ చనలు పాటించాలని గల్ఫ్ ప్రాంతంలోని పలు భారత ఎంబసీలు అప్రమత్తం చేస్తున్నాయి. అక్క డ ఉన్న వలస కార్మికుల ఫోన్లకు నంబర్లు పం పించి అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్ర దించాలని సూచిస్తున్నాయి. రాత్రింబవళ్లు సైరన్ల మోత మోగుతున్నది. ఎప్పడు ఏ వైపు నుంచి బాంబులు పడుతాయో తెలియడం లేదని ఆవేద న చెందుతున్నారు. క్షిపణులు దాడి చేసే సమ యంలో పది నిమిషాల ముందు ఫోన్లకు ఎమ ర్జెన్సీ అలర్ట్ సందేశం వస్తున్నదని అంటున్నారు. సైరన్ మోగిన వెంటనే సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లిపోతున్నామని అంటున్నారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భయం భయంగానే కాలం వెళ్లదీస్తున్నా.. ప్రస్తుతానికి మేమంతా క్షేమంగానే ఉన్నామని అంటున్నారు.
బాధిత కుటుంబాల్లో ఆందోళన..
గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అక్కడ ఉపాధి పొందుతున్న వారి బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమవారు ఎలా ఉన్నారో అని అంటూ పదే పదే ఫోన్లో క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. క్షేమంగానే ఉన్నామని చెబుతుండడంతో కొంత ఊరట చెందుతున్నారు.
ఒక్క మాట బంధువులకు ధైర్యాన్ని ఇస్తుంది..
లక్షలాది మంది కార్మికులకు అన్నం పెడుతున్న గల్ఫ్ దేశాల రూల్స్‌ను ప్రతి ఒక్కరు పాటి ద్దాం. గంటకు రెండు, మూడు చొప్పున బాంబులు పడుతు న్నాయి. అయినా ధైర్యంగా ఉంటూ, కుటుంబ సభ్యులకు క్షేమ, సమాచారాలు అందిస్తున్నాం. ఒక్క మాట తమ బంధువులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే ఎమర్జెన్సీ అలర్ట్‌ను కచ్చితంగా పాటించాలి. వారం రోజులకు సరిపడా సామాగ్రి ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు పెట్టుకోవాలి. ఎల్లప్పుడు ఫోన్ దగ్గర ఉంచుకో వడం మంచిది. పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన పత్రాలు బ్యాగులో సిద్ధంగా పెట్టుకోండి.
– కల్లెడ భూమయ్య, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు, దుబాయ్(జన్నారం మండలం)