గోండా: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్లో విద్యార్థినులు బుర్కా డ్యాన్స్(Burqa Dance) చేశారు. హిందూ అమ్మాయిలకు బుర్కా వేసి.. సినిమా పాటలపై డ్యాన్స్ చేయించారు. ఈ ఘటన గోండా జిల్లాలోని బబాన్జోత్ ఏరియాలో ఉన్న ఔసాని బుజుర్గ్ స్కూల్లో జరిగింది. డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో .. విద్యాశాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ స్కూల్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. స్థానిక విద్యాశాఖ అధికారి అమిత్ కుమార్ సింగ్ ఆదేశాల ప్రకారం బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రియాజ్ అహ్మద్ తనిఖీ చేపట్టారు. స్కూల్ నిర్వహణ ఆపేయాలని కోరుతూ వారం క్రితమే ఆదేశాలు ఇచ్చినట్లు అహ్మద్ తెలిపారు. కానీ ఆదేశాలు పక్కన పెట్టి స్కూల్‌ను నిర్వహించారు. స్కూల్ మేనేజర్ ఆఫీసుతో పాటు ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని మూసివేశారు. ప్రధాన గేటును కూడా అధికారులు సీజ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారాన్ని చేరవేశారు. ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులను సమీప ప్రభుత్వ, గుర్తింపు స్కూళ్లలో చేర్పించారు.
#उत्तर_प्रदेश, गोंडा एक स्कूल में स्वतंत्रता दिवस के कार्यक्रम के दौरान,
,हिंदू छात्राओं को बुर्का पहनाकर अलग-अलग गानो में डांस करवाया गया!
नफ़रत की इंतेहा देखिये कितनी हो चुकी है!
बुर्का शालीनता, धार्मिक आस्था और सांस्कृतिक पहचान का प्रतीक है! pic.twitter.com/cdYFqCV1Ky
— world update hindi (@middle_East_up) August 17, 2026