గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు(India vs Sri Lanka)లో.. విక్టరీకి ఇండియా దగ్గరైంది. మరో నాలుగు వికెట్లు తీస్తే ఇండియా విజయాన్ని నమోదు చేయనున్నది. అయిదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక .. భోజన విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. ప్రస్తుతం దినుషా 65 రన్స్ చేసి క్రీజ్‌లో నాటౌట్‌గా నిలిచాడు. ఇవాళ ఉదయం ధనంజయ, దినుషాలు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు 95 రన్స్ జోడించారు. భారత బౌలర్లు అయిదో వికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ధనంజయ 59 రన్స్ చేసి జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా, శ్రీలంక విజయానికి 197 రన్స్ చేయాల్సి ఉంది. భారత జట్టు తరపున ఇవాళ ఉదయం జడేజా, ప్రసిద్ధి కృష్ణ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.
Lunch on the final day in Galle! 🏟️
Sri Lanka 175/6 after 67 overs#TeamIndia 4⃣ wickets away from victory in the First Test.
Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/iI6TX0ioQl
— BCCI (@BCCI) August 19, 2026