Farmer ID | రాయపోల్, సెప్టెంబర్ 22 : ఫార్మర్ ఐడీ ఉంటేనే పంట కొనుగోలు డిజిటల్ క్రాప్ బుకింగ్ చేయబడుతుందని.. ఫార్మర్ రిజిస్ట్రీని ప్రతి రైతు పూర్తి చేసుకోవాలని సిద్దిపేట జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) బాబు నాయక్ తెలిపారు. రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను బాబు నాయక్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా రాయపోల్ మండల ప్రత్యేక అధికారి, డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు నాయక్ మాట్లాడుతూ.. రైతులందరూ తమ పంట వివరాలను డిజిటల్ క్రాప్ బుకింగ్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రైవేట్ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులను (AEOs) సంప్రదించి పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించారు.
అదేవిధంగా ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకొని ఫార్మర్ ID పొందాలని తెలిపారు. ఫార్మర్ ID ద్వారా రైతుల వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు అవుతాయని, పంటల కొనుగోలు ప్రక్రియలో కూడా ఫార్మర్ ID అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి రైతులు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష, రాంసాగర్
సర్పంచ్ నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన