బూర్గంపహాడ్, సెప్టెంబర్ 22 : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన గడ్డం సత్యం (55) ద్విచక్రవాహనంపై వెనుక పవన్‌కుమార్‌తో కలిసి లక్ష్మీపురం వైపు వెళ్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో నయారా పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న గడ్డం సత్యం లారీ వెనుక టైరు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న పవన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సత్యం కుమారుడు గడ్డం ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.