వృద్ధురాలిపై చిత్రహింసలకు పాల్పడిన వారిపై కేసు నమోదు
దెయ్యం వదిలించే పేరుతో వృద్ధురాలిపై చిత్రహింసలకు పాల్పడిన అమానుష సంఘటనకు సంబంధించి పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ స్పందించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని సంబంధించిన కారకులపై మంగళవారం కేసు నమోదు చేశారు.
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 22 : దెయ్యం వదిలించే పేరుతో వృద్ధురాలిపై చిత్రహింసలకు పాల్పడిన అమానుష సంఘటనకు సంబంధించి పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ స్పందించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని సంబంధించిన కారకులపై మంగళవారం కేసు నమోదు చేశారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని జింకలగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు షేక్ షకీనాబిని చేతబడి నెపంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తాళ్లతో కొడుతూ ఆమెను చెట్టు ఎక్కిస్తూ కింద మేకులు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో సోమవారం రావడం జరిగింది. ఈ సంఘటనపై బూర్గంపహాడ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటన జూలై నెలలో జరిగిందని, సదరు వృద్ధురాలు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె బంధువులు ఇలా మూఢనమ్మకంతో తనని తాళ్లతో కొట్టడం, చెట్టు ఎక్కిస్తూ, చెట్టుకు మేకులు కొట్టడం జరిగిందని డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కారకులైన షేక్ మదర్, షేక్ ఫయాజ్, కరీముల్లా, మరికొంతమందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మూఢనమ్మకాలు, చేతబడి పేరుతో ఎవరినైనా హింసించినా, దుర్భాషలాడినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

