Mark Wood : ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గాయాలతో సతమవుతూనే కెరీర్ కొనసాగించిన వుడ్ వచ్చే వేసవి యాషెస్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు వరల్డ్‌కప్ (వన్డే, టీ20)లు, యాషెస్ విజేత అయిన అతడు 36 ఏళ్ల వయసులోనే ఆటకు అల్విదా చెప్పేశాడు. యుద్ధంలో ఓడిపోయానంటూ వుడ్ తన వీడ్కోలు వార్తను పంచుకున్నాడు. బుల్లెట్ బంతులతో బ్యాటర్లను భయపెట్టిన వుడ్ 11 ఏళ్ల కెరీర్‌ను ముగించడంతో.. ఇంగ్లండ్ మరో పేస్ తరుపుముక్క సేవల్ని కోల్పోనుంది.
పేస్ బౌలర్ల కెరీర్ పదేళ్లకు పైగా సాగడమే గొప్ప అని మరోసారి నిరూపితమైంది. తరచూ వేధిస్తున్న గాయాల కారణంగా ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ వీడ్కోలు పలికాడు. గాయపడిన ప్రతిసారి బలంగా తిరిగొచ్చిన వుడ్ ఈసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే ఏడాది యాషెస్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల రేసులో తాను లేనంటూ రిటైర్మెంట్ వార్త వెలిబుచ్చాడు. దశాబ్ద కాలంలో ఇంగ్లండ్ పేస్ దళంలో ఒకడిగా సేవలందించిన వుడ్ 11 ఏళ్ల కెరీర్‌ను ముగించాడు.
JUST IN: England fast bowler Mark Wood has announced his retirement from international cricket at the age of 36 pic.twitter.com/ju0tvINDiw
— Cricinfo (@cricinfo) September 22, 2026
‘గాయాల నుంచి కోలుకొని.. తిరిగి మైదానంలో దిగి ప్రతి ఒక్కరికి నేను ఏం చేయగలనో చూపాలని అనుకునేవాడిని. కానీ, ఈసారి నేను యుద్ధంలో ఓడిపోయా. వైద్యుల సూచన మేరకు నేను టెస్టులు, వన్డేలు ఆడడం ఇక అసాధ్యం. దాంతో, కొన్నాళ్లుగా మళ్లీ ఇంగ్లండ్‌కు ఆడుతాననే నా కల కరిగిపోసాగింది. ఇంగ్లండ్ తరఫున ఆడాలనేది నా కల నిజమైంది. దేశం తరఫున ఆడుతున్నప్పుడు నాలోని పిల్లాడు ఎంతో సంబురపడేవాడు. ప్రపంచం తిరగడం, అసాధారణమైన వ్యక్తులను కలుసుకోవడం.. ఉత్తమ జట్లతో ఆడడం వంటివి నా అదృష్టంగా భావిస్తున్నా’ అని వుడ్ పేర్కొన్నాడు. పేస్ సంచలనంగా జట్టులోకి వచ్చి.. బంతితో విరుచుకుపడిన వుడ్ నిరుడు నవంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
Mark Wood has announced his retirement from international cricket
He always gave everything for the Three Lions, on and off the field 🦁
What a career, what a player 🙌 pic.twitter.com/d9keObjqbt
— England Cricket (@englandcricket) September 22, 2026
వరల్డ్‌కప్ విజేతగా కెరీర్ ముగించిన మార్క్ వుడ్ 2019 వన్డే ఎడిషన్‌లో అదరగొట్టాడు. ఏకంగా 18 వికెట్లతో ఇంగ్లండ్ తొలిసారి వన్డే ఛాంపియన్‌గా అవతరించడంలో వుడ్ కీలక పాత్ర పోషించాడు. కానీ, అతడికి బదులు ఫైనల్లో వీరోచితంగా పోరాడిన బెన్ స్టోక్స్.. సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేసిన జోఫ్రా ఆర్చర్‌కు క్రెడిట్ దక్కింది. మూడేళ్ల తర్వాత.. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌లోనూ వుడ్ తన తడాఖా చూపించాడు. ఈసారి వుడ్ కాకుండా ఆల్‌రౌండర్ సామ్ కరన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మార్క్ వుడ్ ప్రస్థానం లార్డ్స్ స్టేడియంలో మొదలైంది. 2015లో ఇదే వేదికపై న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన వుడ్.. అనతికాలంలోనే నమ్మదగిన పేసర్‌గా మారాడు. అండర్సన్, స్టువార్ట్ బ్రాడ్ తర్వాత ఆధారపడదగ్గ బౌలర్‌గా ఎదిగిన అతడు.. టెస్టుల్లో గొప్పగా రాణించాడు. కేవలం 38 మ్యాచుల్లోనే 119 వికెట్లు తీశాడీ స్పీడ్‌స్టర్. వైట్ బాల్ ఫార్మాట్లో ఫర్లేదనిపించిన వుడ్ 70 వన్డేల్లో 80, 38 టీ20ల్లో 54 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడతడు.
Mark Wood bids farewell to international cricket with an emotional message 🥺🫶🏻 pic.twitter.com/rg7NsIqzZd
— Cricinfo (@cricinfo) September 22, 2026