Ludhiana | మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు.. పిజ్జా దుకాణంలో కలకలం
Ludhiana | ఓ పిజ్జా దుకాణంలో మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఇది తమ పనేనని ఓ గ్యాంగ్ సోషల్ మీడియాలో చెప్పింది. దీంతో ఈ ఘటనపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Ludhiana | లూధియానా: పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో ఉన్న ఓ పిజ్జా (Pizza) దుకాణంలో కాల్పుల ఘటన భయాందోళన కలిగించింది. అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని దుండగులు పిజ్జా దుకాణంలోకి వచ్చి మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దాలు ఉలిక్కిపాటుకు గురిచేశాయి. లూధియానాలోని విలాసవంతమైన ప్రాంతం అయిన భాయ్ రణధీర్ సింగ్ నగర్లో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దుండగులు కాల్పులు జరిపిన తరువాత దుకాణంలోని సిబ్బంది, కస్టమర్లు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు తామే బాధ్యులం అని పేర్కొంటూ ‘గోపి లహోరియా గ్రూప్’ ఇన్‌స్టా (Insta) ఖాతాలో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. బెదిరింపు ధోరణిలో ఆ పోస్ట్ ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇన్‌స్టా ఖాతాకు ఏదైనా గ్యాంగ్‌తో సంబంధం ఉందా, లేదా భయాన్ని వ్యాప్తి చేయడానికి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీ, సోషల్ మీడియా పోస్ట్‌ను పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

