– సింగరేణి సరిపడా ఉత్పత్తి చేస్తున్నా ఎందుకు ఇస్తలేరు?
– ఇటు ఏపీ, అటు కర్ణాటకకు దొంగతనంగా బొగ్గు అమ్ముకుంటున్న వైనం
– మాజీ సీఎం కేసీఆర్‌లాగే 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్
– ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వైటీపీఎస్ సందర్శన
నల్లగొండ, సెప్టెంబర్ 24 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS)లో బొగ్గు కొరత ఉంది అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కనే కారణం అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్లాంట్లను మూసివేస్తూ కరెంటు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తునందుకు ప్లాంట్ ను సందర్శించి, విద్యుత్ ఉత్పత్తి నిలిపివేతకు గల కారణాలను ప్లాంట్‌లోని అధికారులతో సమావేశమై చర్చించారు.

బొగ్గు కొరతకు ప్రభుత్వమే కారణం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పనికిమాలిన ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి తన గురువు, ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఒకవైపు మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దొంగతనంగా బొగ్గును అమ్ముకుంటున్నాడు. ఇది కేవలం ప్రభుత్వ స్కాం తప్ప ఇంకోటి కాదన్నారు. బొగ్గు మంత్రి అన్ని బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. సింగరేణి భ్రమ్మాండంగా బొగ్గు ఉత్పత్తి చేస్తుందని, 40 లక్షల టన్నుల బొగ్గును దొంగతనంగా అమ్ముకున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేలా తప్పకుండా అన్ని పవర్ ప్లాంట్లకు ప్రభుత్వం బొగ్గు సరఫరా చేయాలన్నారు. 24 గంటల విద్యుత్ కేసీఆర్ ఏ విధంగా ఇచ్చాడో అదేవిధంగా ఇప్పుడు కూడా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బొగ్గు కొరతకు ప్రభుత్వమే కారణం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి