గన్నేరువరం,ఆగస్ట్19 : గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పోత్తూరు వరకు చేపట్టిన డబుల్ రోడ్డును పూర్తి చేయాలని ఈనెల 21న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో ప్రతి రోడ్డుపై పాదయాత్ర చేసి రోడ్లు వేపిస్తానని చెప్పిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న రోడ్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
నాటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతూ ప్రారంభిస్తున్నారు తప్ప కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దారుణంగా విఫలమయ్యారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే గన్నేరువరం మండలాన్ని ఏర్పాటు చేసి మండల అభివృద్ధి కోసం డబుల్ రోడ్డు సాంక్షన్ చేసి రూ. 71 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. డబుల్ రోడ్డు అనేది రాజకీయ అంశం కాదని ప్రజలకు సంబంధిచిందని ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి కి చిత్తశుద్ధి ఉంటే డబుల్ రోడ్డు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్ పర్సన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న, మాజీ జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, గూడేల్లి ఆంజనేయులు, అటికం శ్రీనివాస్, పీచు మహేందర్ రెడ్డి, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గూడూరి సురేష్, రవి, వంశీకృష్ణారెడ్డి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.