Daren Sammy : పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వెస్టిండీస్ జట్టుపై పడింది. పొట్టి ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఓడిన విండీస్ బృందం ఇంకా కోల్‌కతాలోనే ఉండిపోయింది. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దైన నేపథ్యంలో కరీబియన్ ఆటగాళ్లు స్వదేశం వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్నారు. హెడ్‌కోచ్ డారెన్ సమీ (Daren Sammy) అయితే.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 1 ఆదివారం సెమీస్ బెర్తు కోసం భారత్, వెస్టిండీస్ తలపడ్డాయి. కానీ, ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ విధ్వంసంతో విండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అమెరికా, ఇజ్రాయేల్ – ఇరాన్ యుద్ధం కారణంగా వారిని వెంటనే పంపించలేని పరిస్థితి. దాంతో.. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ కరీబియన్ ఆటగాళ్లు కోల్‌కతాలోనే ఉన్నారు.
As West Indies remain stuck in Kolkata four days after being eliminated from the #T20WorldCup, their head coach Daren Sammy has put out a public plea – “I just wanna go home” 🗣️ pic.twitter.com/gk4TEH9LtG
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2026
ఈ పరిస్థితుల్లో ఆ జట్టు హెడ్‌కోచ్ డారెన్ సమీ ఎక్స్ పోస్ట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ‘నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నా. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారో చెప్పండి. మేము కోల్‌కతాలోనే ఉండి ఐదు రోజులైంది. ఈరోజు.. రేపు.. కాంటే వచ్చే వారం.. ఏదో ఒక రోజు పంపిస్తామని అయినా చెప్పండి’ అని సమీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. సమీ పోస్ట్‌లో వెస్టిండీస్ క్రికెట్‌గానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలిగానీ ఇంకా స్పందించలేదు.