Delhi Pollution | వాయు కాలుష్య (Delhi Pollution) నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ స్థానికులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారిని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులపై కొందరు పెప్పర్ స్ప్రే (Chilli Spray) చల్లడంతో ముగ్గురు నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలపై 22 మందిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
అధ్వాన గాలి నాణ్యతను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కొందరు పౌరులు ఆదివారం ఇండియా గేట్ వద్ద ఆందోళన చేశారు. అయితే అక్కడ అందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని పంపించేశారు. దాంతో వారు సీ-హెక్సాగాన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న బారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించారు. తర్వాత రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అంతేకాదు మావోయిస్టు హిడ్మా అనుకూల నినాదాలు చేశారు. వారిని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులపై హఠాత్తుగా పెప్పర్ స్ప్రే చల్లారు. దీనిపై అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు.
Also Read..
Operation Crystal Fortress | ఢిల్లీలో కలకలం.. ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Justice Surya Kant | 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
లేబర్ కోడ్స్‌పై పీఛేముడ్.. కార్మిక సంఘాల నిరసన పిలుపుతో దిగివచ్చిన మోదీ సర్కార్