హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : సామ్రాజ్యవాద దురాక్రమణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యా హూ కూటమిగా వ్యవహరిస్తూ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హకుల ఉల్లంఘన అని, తక్షణమే యు ద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు వలి ఉల్లాఖా ద్రీ, కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి, మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణ లు, రాజదౌత్యం మాత్రమే మార్గమమని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్ర యత్నాలు కొనసాగిస్తున్నాయని మం డిపడ్డారు. యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేదలు, మహిళలు, పిల్లలు నష్టాన్ని ఎదురొంటారన్నారు.