సుల్తాన్‌బజార్, మార్చి 8: ఆడపిల్లలకు కట్నాలు ఇవ్వకుండా వారి ఉన్నత చదువులకు, వ్యాపారాలు చేసి తమ కాళ్లపై తాము నిలబడేలా తోడ్పాటును అందించేలా తల్లి దండ్రులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల అధ్యక్షురాలు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ జి రాధారాణి పేర్కొన్నారు. ఆదివారం రాంకోఠిలోని కచ్చి భవన్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ సంయుక్తాధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగుల తొలి మహిళా కన్వెన్షన్‌ను నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన రాధారాణి మాట్లాడుతూ.. ఆడపిల్లలకు పెళ్లి ఆటంకం కాకుండా అన్ని రంగాలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు క్రాంతి కుమార్ మక్కడ్, ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎస్ వెంకటేశ్వర్లు, అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ కో ఫౌండర్ అండ్ సీఈవో, నారీమణి అవార్డు గ్రహీత పద్మ కొప్పుల, కామ్రెడ్ ఎన్ మీనా, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వేణురావు, ప్రధాన కార్యదర్శి బాపు, ప్రతాప్‌రెడ్డి, వెంకట్రామయ్య, బి రవికాంత్, ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ సభ్యులు ప్రకాషం, భిక్షమయ్య, రమేష్ భూపాల్, బెఫీ అధ్యక్షులు సతీష్, మహిళా ప్రతినిధులు , తెలంగాణ రాష్ట్రంలోని 17 రీజియన్ల నుంచి సుమారు 500 మందికి పైగా మహిళా ఉద్యోగిణులు పాల్గొన్నారు.