Rythu Bharosa | అసెంబ్లీ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతులను కష్టాల పాలు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ సర్కార్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిగొచ్చిన రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో చర్చించినట్టు సమాచారం.
తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మొత్తం మూడు విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లోకి చేరనున్న సుమారు రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమకానున్నాయి.