Dasoju Shravan Kumar | కేటీఆర్ ఆదరణ చూసి ఓర్వలేక డ్రగ్స్ ఆరోపణలు : దాసోజు శ్రవణ్ కుమార్
Dasoju Shravan Kumar | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల, ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల, ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ( Dasoju Shravan Kumar ) ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు.
మోకాలుకి, బోడి గుండుకి లింక్ పెట్టినట్లు, మొయినబాద్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్లో పార్టీ జరిగితే, దాన్ని కేటీఆర్కు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసీ, ఫ్యూచర్ సిటీ అవినీతి గురించి బైట పెట్టినందుకు కేటీఆర్పై దాడి చేస్తున్నారని విమర్శించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ గురించి మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతా అని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కేటీఆర్కు లింక్ పెట్టడం దేనికని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాగా ఏది పడితే అది మాట్లాడొద్దని హితవు పలికారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టొద్దని, టీడీపీ ఎంపీ అయినా సరే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినా సరే, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎవరు ఉన్నా తప్పు చేస్తే వదిలిపెట్టొద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

