Rayapole High School | రాయపోల్, నవంబర్ 24 : ఈ నెల 19, 20, 21 తేదీల్లో సిద్దిపేట జీజీహెచ్ఎస్ స్కూల్లో జిల్లా స్థాయి ఇన్స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించగా.. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ (హైస్కూల్) జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుని రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.
‘వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై బయోసైన్స్ గైడ్ టీచర్స్ కే స్వాతి, వై హరీష్ ఆధ్వర్యంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు నిశాంత్ రెడ్డి, చరణ్ ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్ అందరి మన్ననలు పొంది.. రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇందులో భాగమైన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలుపుతూ రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని పాఠశాల అధ్యాపకులు పేర్కొన్నారు.
AR Rahman | మతం పేరుతో చంపడం చాలా తప్పు.. ఇస్లాం మతంలోకి వెళ్లడానికి కారణం ఇదే: ఏఆర్ రెహమాన్