Road accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం
Road accident | జిల్లాలోని భువనగిరి (Bhuvanagiri) మండలం వడపర్తి గ్రామ శివారులో అమ్మ అనాధ శరణాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ మహిళ మృతి చెందింది.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి (Bhuvanagiri) మండలం వడపర్తి గ్రామ శివారులో అమ్మ అనాధ శరణాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ మహిళ మృతి చెందారు.
రెండు డీసీఎంలు అతి వేగంతో ఆటోని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది . మృతులు బీఎన్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తల్లి కొడుకులు( Mother And Sons ) నరేష్, సురేష్, కేతమ్మ గా పోలీసులు గుర్తించారు. నరేష్ వికలాంగుడు కాగా, స్పాట్ లోనే మృతి చెందాడు. సురేష్ భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కేతమ్మ మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్ తీసుకు వెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సురేష్ ఆర్టీసీ లో కాంట్రాక్ట్ విధానం లో పని చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బీఎన్ తిమ్మాపూర్ నుంచి భువనగిరి కి వెళ్లి, పనులు చూసుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి లోనయ్యారు. మృత దేహాలను శవ పరీక్ష నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చూరి కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

