Ravi Shastri : స్వదేశంలో చెలరేగి ఆడే భారత క్రికెటర్లు మరోసారి తడబడ్డారు. కోల్‌కతాలో విఫమైన స్టార్ ప్లేయర్లు గువాహటి టెస్టులో(Guwahati Test)నూ ‘మేము ఆడలేమంటూ’ చేతులెత్తేశారు. ప్రత్యర్ధి బ్యాటర్లు దంచేసిన చోట భారత ఆటగాళ్లు వికెట్ కాపాడుకోలేక జట్టు విజయావకాశాల్ని దెబ్బతీశారు. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన టీమిండియాపై మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) మండిపడ్డాడు. మంచి వికెట్ మీద భారత క్రికెటర్లు పేలమైన బ్యాటింగ్ చేశారని తీవ్రంగా విమర్శించాడు శాస్త్రి.
గువాహటి టెస్టుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. బౌలింగ్‌లో తేలిపోయిన భారత జట్టు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటకపోవడమే అందుకు కారణం. తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవ్వడంపై అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పట్టుదలగా క్రీజులో నిలవాల్సిన టాపార్డర్, మిడిలార్డర్ చెత్త ఆటతో పేస్‌కు దాసోహమవ్వడం విమర్శలకు తావిస్తోంది. కామెంటరీ బాక్స్‌లో నుంచి మ్యాచ్‌ను వీక్షించిన రవి శాస్త్రి మరీ చెత్తగా ఆడారని విమర్శించాడు.
The lack of application and poor shot selection caused India’s collapse.😵💫
btw, there were NO DEMONS on this Guwahati pitch!
PC: Jiostar#INDvsSA #Test #Cricket #SaiSudharsan #TeamIndia #GautamGambhir pic.twitter.com/eCdhTTJwYB
— OneCricket (@OneCricketApp) November 24, 2025
‘మూడో రోజు కూడా గువాహటి వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. అయినా సరే మనవాళ్లు చాలా సాధారణమైన బ్యాటింగ్ చేశారు. 122కే 7 వికెట్లు పడాల్సిన వికెట్ అయితే కాదని కచ్చితంగా చెప్పగలను. తమ ప్రదర్శన పట్ల భారత ఆటగాళ్లు ఏమాత్రం సంతోషంగా ఉండరు. ప్లేయర్లంతా చేతులు పైకెత్తి నిజంగా మేము చాలా పేలవమైన ఆట ఆడాం అని మనస్ఫూర్తిగా అంగీకరించాలి’ అని రవి శాస్త్రి అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఔటైన తీరుకు కామెంటరీ బాక్స్‌లోని షాన్ పొలాక్ షాకయ్యాడు. కెప్టెన్ రిషభ్ పంత్ సహ చాలామంది తేలికగా వికెట్ ఇచ్చేశారని సఫారీ పేస్ దిగ్గజం పేర్కొన్నాడు.
సఫారీలు పరుగుల పండుగ చేసుకున్న చోట యశస్వీ జైస్వాల్(58) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. ఓవర్‌నైట్ స్కోర్ 9/0తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ను మహరాజ్ దెబ్బకొట్టాడు. రాహుల్‌ను స్లిప్‌లో ఆడేలా చేసిన అతడిని వెనక్కి పంపాడు.. కాసేపటికే యశస్వీని హార్మర్ బోల్తా కొట్టించాడు. అనంతరం.. జాన్సెస్ విజృంభణకు.. అద్భుత ఫీల్డింగ్ తోడవ్వగా 142కే ఏడు వికెట్లు కోల్పోయింది భారత్.
Innings Break!#TeamIndia trail South Africa by 288 runs.
Over to our bowlers in the second innings.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/qG9qEx4j94
— BCCI (@BCCI) November 24, 2025
ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరిన ఆ దశలో క్రీజులో పాతుకుపోయిన వాషింగ్టన్ సుందర్(48), కుల్దీప్ యాదవ్(19) ఆపద్భాందవులయ్యారు. ప్రత్యర్ధి బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం ఎనిమిదో వికెట్‌కు 72 రన్స్ జోడించి పరువు కాపాడింది. వీరిద్దరి అసమాన పోరాటంతో భారత్ 201 రన్స్ చేయగలిగింది. దాంతో.. పర్యాటక జట్టుకు 288 పరుగుల ఆధిక్యం లభించింది.