హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని తెల్లాపూర్‌లో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. పశ్చిమబెంగాల్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెల్లాపూర్‌లోని ఓ లేబర్ క్యాంప్‌లో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి 42 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
దీని విలువ రూ.21 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. బెంగాల్‌కు చెందిన మితున్ భర్మా, సుడెన్ రాయ్, షేక్‌ను అరెస్టు చేశామని, ప్రధాన నిందుతుడు బిస్వా తప్పించుకున్నాడని తెలిపారు. వారి వద్ద గంజాయితోపాటు 5 ఫోన్లు సీజ్ చేశామన్నారు. నిందితుపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.