Period Pains | నెలసరి సమయంలో మహిళలకు ఉండే నొప్పులు, వారు పడే బాధ వర్ణనాతీతం. కొందరు మహిళలకు హార్మోన్ల సమస్యలు ఉన్నా ఇలాగే జరుగుతుంది. అలాగే పీఎంఎస్ దశలో ఉన్నవారికి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు సహజమే అయినప్పటికీ కొందరికి ఈ నొప్పులు మరీ తీవ్రంగా ఉంటాయి. అవి వారిని తరచూ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. దీంతో చెప్పలేని నొప్పి, బాధ ఉంటాయి. ఈ క్రమంలో వారు ఏ పనిచేయకపోతుంటారు. అలాగే ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటాయి. దీనికి తోడు అలాంటి మహిళల్లో కొందరికి జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 90 శాతం మంది మహిళలు ఏదో ఒక సమయంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ నొప్పులకు గాను ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. పలు ఇంటి చిట్కాలను పాటిస్తుంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.
నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పులు ఉండే వారు రాత్రి పూట నీటిలో గుప్పెడు కిస్మిస్లను, కొద్దిగా కుంకుమ పువ్వును వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్లను తాగి అనంతరం అందులో నానిన ఆ పదార్థాలను తినాల్సి ఉంటుంది. ఇలా చేస్తుండడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ చిట్కాను రోజూ పాటిస్తుంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. మహిళలకు ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ఈ చిట్కాను పాటించడం వల్ల ఒత్తిడి, ఆందోళన సైతం తగ్గుతాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక మహిళలు నెలసరి సమయంలో అరటి పండ్లను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీని వల్ల అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. అరటి పండ్లలో ఉండే విటమిన్ బి6, పొటాషియం నొప్పులను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఈ పండ్లను తినడం వల్ల గ్యాస్ తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
మహిళలు నెలసరి సమయంలో చిలగడదుంపలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే ముల్లంగి, బీట్ రూట్ వంటి దుంపలను సైతం తివనచ్చు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు రోగ నిరోధఖ శక్తి పెరిగేలా చేస్తాయి. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల నెలసరి నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిల్లో ఉండే పాలిఫినాల్స్ రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక మహిళలు ఈ దుంపలను తింటుంటే ఫలితం ఉంటుంది. రుతు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చు.
మహిళలు చిరు ధాన్యాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను రోజూ తింటుండాలి. వీటిల్లో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఈ ధాన్యాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల స్త్రీలకు రుతు సమయంలో ఉండే నొప్పులు తగ్గిపోతాయి. అలాగే హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు, యాక్టివ్‌గా ఉంటారు. కనుక మహిళలు రోజూ చిరు ధాన్యాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే మహిళలు రోజుకు ఒక టీస్పూన్ చొప్పున నెయ్యిని తింటుండాలి. దీని వల్ల కూడా నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. నెయ్యిని తినడం వల్ల చర్మం పగలకుండా సురక్షితంగా ఉంటుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటుంటే మహిళలు తమకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.