Congress MLAs | కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీలో లుకలుకలు.. సీనియర్ సభ్యుడిపై యువ ఎమ్మెల్యేల గుర్రు
అధికార పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యే లు మరోసారి భేటీ అయ్యారా? 9 మంది యువ ఎమ్మెల్యేల బ్యాచ్ ఓ సీనియర్ ఎమ్మె ల్యే మీద గుర్రుగా ఉన్నారా
Congress MLAs | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అధికార పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యే లు మరోసారి భేటీ అయ్యారా? 9 మంది యువ ఎమ్మెల్యేల బ్యాచ్ ఓ సీనియర్ ఎమ్మె ల్యే మీద గుర్రుగా ఉన్నారా? వట్టి మాటలే తప్ప ఆయనతో పని కాదని.. యువ ఎమ్మెల్యే లు అంచనాకు వచ్చారా? బాంబు పేలుస్తాన ని.. తనకు లాక్కోవడమే తప్ప అడుకోవడం రాదని.. బయట బీరాలు పలికి, లోపల తెరవెనుక ముఖ్యనేతకు సరెండర్ అయ్యారని వాళ్లు నమ్ముతున్నారా? ఎంతవరకైనా తెగిద్దామంటూ రహస్య సమావేశాలు పెట్టించి, ఇప్పుడు ఆయనే ముఖ్యనేతకు లీకులు ఇస్తున్నారా? గత అసెంబ్లీ సమావేశాల్లో ఓ పోలీసు అధికారి మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టాలనుకు న్న విషయాన్ని కూడా ఆయనే లీక్ చేశారని కోపంగా ఉన్నారా?.. ఈ ప్రశ్నలకు అసమ్మతి బ్యాచ్‌లోని కొందరు ఎమ్మెల్యేల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
పెండ్లి వేడుకలో ఏకాంత భేటీ
గతంలో ముఖ్యనేతపై తిరుగుబాటు చేసిన 9 మంది యువ ఎమ్మెల్యేలు ఇటీవల మరోసారి ఏకాంతంగా కలవడం కాంగ్రెస్ వర్గాల్లో అలజడి రేపుతున్నది. ప్రభుత్వ పెద్దలపై అసంతృప్తితో ఉన్న ఈ ఎమ్మెల్యేలు.. తొలి ఏడాదిలోనే హైదరాబాద్‌లోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశమైన వార్త సంచలనంగా మారింది. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఈ ఎమ్మెల్యేలకు నల్లగొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే టీం లీడర్‌గా ఉన్నట్టు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఆధ్వర్యంలోనే మరోసారి వారు రహస్యంగా కలుసుకొని మా ట్లాడుకున్నట్టు తెలిసింది. మొదట ఒక పెండ్లి వేడుక కోసం హాజరై, ఆ తర్వాత వారు ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలిసింది. కాగా ఇటువంటి సమావేశాలను ముందుండి నడిపించే హైదరాబాద్ శివారు ఎమ్మెల్యే ఈసారి డుమ్మా కొట్టినట్టు సమాచారం. రెండు గంటలపాటు వారు భేటీ అయినట్టు సమాచారం.
జనం మిమ్మల్ని నమ్ముతారా?
మంత్రివర్గ విస్తరణలో తమకు ప్రాధాన్యం లభించడం లేదని, నియోజకవర్గాలకు నిధు లు రావడం లేదని వారి మధ్య తొలుత చర్చ కు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంలోనే ఒక యువ ఎమ్మెల్యే కల్పించుకొని.. ‘రాజకీయంగా మీ తుది నిర్ణయం ఏమిటి?’ అని సీనియర్ ఎమ్మెల్యేను నిలదీసినట్టు తెలిసింది. ముఖ్యనేత మీద ఒత్తిడి పెంచాలని అనుకున్న ప్రతిసారి ఆయనకు సరెండర్ అవుతున్నారం టూ ఘాటుగా వ్యాఖ్యానించినట్టు సమాచా రం. నిన్నటి దాకా ముఖ్యనేత మీద విమర్శలు చేసి, ఇప్పుడు ఉన్నట్టుండి ప్రశంసించడం ఏమిటంటూ నిలదీసినట్టు తెలిసింది. ఇలాంటి తీరుతో ప్రజల్లో మీరు చులకన అవుతున్నారని, మీ వెంట ఉన్నందుకు జనం మమ్మల్ని కూడా చులకనగా చూస్తారని అన్నట్టు తెలిసిం ది. ‘మీరే రహస్య సమావేశాలు పెడతారు, మళ్లీ మీరే విషయాలను బయటికి లీక్ చేస్తా రు’ అని యువ ఎమ్మెల్యే నిలదీయగా, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్‌తో ప్రయాణం ప్రమాదకరం
మరో యువ ఎమ్మెల్యే అందుకుంటూ.. గత అసెంబ్లీ సమావేశాల్లో మన సత్తా ఏమిటో చూపించే అవకాశం వచ్చినా, మీరే చెడగొట్టారంటూ సీనియర్ ఎమ్మెల్యేను విమర్శించినట్టు సమాచారం. ‘హైదరాబాద్‌లో జరిగిన ఒక భూ వివాదంలో తలదూర్చి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఓ పోలీసు ఉన్నతాధికారి మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని గత సమావేశ సమయంలో అనుకున్నాం. సలహా కోసం మీ దగ్గరికి వస్తే, మీరు విషయాన్ని ము ఖ్యనేతకు చేరవేశారు. దీంతో వేసుకున్న ప్రణాళిక అంతా తారుమారు అయ్యింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచా రం.
చైనా సరుకును నమ్ముకొని రాజకీయాలా?
ఇంత జరిగినా.. ఆ సీనియర్ ఎమ్మెల్యే ఇటీవల నేరుగా ముఖ్యనేతకు ఫోన్‌చేసి ఏకాంత భేటీ వివరాలను చెప్పినట్టు తెలిసింది. తమవాళ్లు అవేశంగా ఉన్నారని, తనకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీతో టచ్‌లోకి వెళ్తారని అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్రమత్తమైన ముఖ్యనేత తన సోషల్ మీడియా ప్రతినిధుల ద్వారా 9 మంది ఎమ్మెల్యేల భేటీని బయటపెట్టినట్టు సమాచారం. దీంతో యువ ఎమ్మెల్యేలు కంగుతిన్నట్టు తెలిసింది. ‘చైనా సరుకులాంటి ఆయనను నమ్ముకొని రాజకీయాలు చేయడమంత ప్రమాదం మరొకటి లేదు’ అంటూ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

