లండన్: మెడికల్ వండర్ జరిగింది. డాక్టర్లతో పాటు పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. మూడేళ్లు బాలుడు ఒలివర్ చు అరుదైన హంటర్ సిండ్రోమ్(Hunter Syndrome) వ్యాధి నుంచి కోలుకుంటున్నాడు. ఈ వ్యాధినే ఎంపీఎస్2గా పిలుస్తారు. అయితే జీన్ థెరపీ ద్వారా డాక్టర్లు ఈ అద్భుతాన్ని సృష్టించారు. మాంచెస్టర్ వైద్య బృందం ఈ సక్సెస్‌లో కీలక రోల్ ప్లే చేసింది. వివరాల్లోకి వెళ్తే..
ఒలివర్ చూకు హంటర్ సిండ్రోమ్ వ్యాధి ఉన్నది. ఈ వ్యాధి వల్ల బాడీ, బ్రెయిన్ దెబ్బతీనే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న వ్యక్తులు 20 ఏళ్లు నిండిలోపే ప్రాణాలు వదిలేస్తారు. ఓ రకంగా ఈ వ్యాధిని చైల్డ్‌వుడ్ డిమెన్షియా అంటారు. పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండదు. జ్ఞాపకశక్తి లోపిస్తుంది. అయితే హంటర్ సిండ్రోమ్‌కు కారణమైన జన్యువును గుర్తించిన శాస్త్రవేత్తలు. జీన్ థెరపీ ద్వారా చికిత్స చేశారు.
కణాలు ఆరోగ్యంగా ఉండాంటే కీలకమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కానీ హంటర్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల్లో ఆ ఉత్పత్తి ప్రక్రియ సక్రమంగా ఉండదు. దీని వల్ల పిల్లల్లో డిమెన్షియా వస్తుంది. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి సారి మాంచెస్టర్ వైద్య బృందం ఓ అద్భుతం సృష్టించింది. ఆ వ్యాధి ముదరకుండా ఉండేందుకు జీన్ థెరపీ చేశారు. ఒలివర్ శరీర కణాలను జీన్ థెరపీ ద్వారా ట్రీట్ చేశారు.
ప్రొఫెసర్ సైమన్ జోన్స్ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరిగింది. రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో శస్త్ర చికిత్స చేశారు. ఏడాది తర్వాత ఒలివర్ శరీరం సాధారణ రీతిలో డెవలప్ అవుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.