Edupayala Jatara | పాపన్నపేట, అక్టోబర్ 19 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధి ఆదివారం జన జాతరగా మారింది. సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా మళ్లీ సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీటిని వదులుతుండడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు.
ముందుగా వేకువజామున ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం రాజా గోపురంలో పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ ఇవో చంద్రశేఖర్ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యామ్, మధుసూదన్ రెడ్డి, నర్సింలు, బత్తిని రాజు, వరుణ్ చారి, యాదగిరి తదితరులు ఏర్పాటు చేయగా, వేద పండితులు శంకరశర్మ ,పార్థివ శర్మ, రాము శర్మ తదితరులు పూజలు నిర్వహించారు.
ఏడుపాయలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టారు