Mandhana – Palash : వన్డే ప్రపంచ కప్‌లో భారత మహిళా క్రికెట్లో స్మృతి మంధాన (Smriti Mandhana) ధనాధన్ ఆటతో శుభారంభాలు ఇస్తోంది. తన విధ్వంసక ఆటతో ఇప్పటికే ఈ ఏడాది నాలుగు శతకాలతో రికార్డు నెలకొల్పిందీ ఓపెనర్. ఆటతోనే కాదు ఈమధ్య తన ప్రేమ ప్రయాణంతోనూ వార్తల్లో నిలుస్తోందీ ముద్దుగుమ్మ. ఐదేళ్లుగా సంగీత దర్శకుడితో లవ్‌లో ఉన్న ఈ డాషింగ్ బ్యాటర్.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఐదేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రియుడిని మనువాడనుంది. ఈ విషయాన్నిఎవరో కాదు స్వయంగా మంధాన లవర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) మీడియాకు వెల్లడించాడు. సో.. ఈ జంట మరికొద్ది రోజుల్లోనే బ్యాచిలర్ లైఫ్‌ను ముగించనుంది. పలాశ్ కామెంట్స్‌తో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బాజా ఎప్పుడు మోగనుంది? అనే చర్చ జోరందుకుంది.
మహిళల క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్‌గా వెలుగొందుతున్న స్మృతి మంధాన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో ప్రేమలో ఉంది. నిరుడు ప్రేమికుడితో కలిసి తమ ఐదేళ్ల అనుబంధాన్ని కేకు కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారిద్దరూ. దాంతో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు చూసిన ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడు?అని కామెంట్లు పెట్టారు. అప్పటి నుంచి వీళ్ల పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తున్నాయి.
Palash Muchhal Confirms Wedding To Cricketer Smriti Mandhana https://t.co/J47yeZePXh pic.twitter.com/bV6ELfhkSp
— NDTV Movies (@moviesndtv) October 18, 2025
ఇటీవలే ఇండోర్‌లోని ప్రెస్ క్లబ్లో మంధానతో మీ అనుబంధం గురించి చెప్పండి అని జర్నలిస్టులు పలాశ్ను అడిగారు. అందుకు మంధాన త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది. ఇప్పుడు మీకు ఈ విషయం మాత్రమే చెప్పగలను. ఇంకేం చూస్తున్నారు.. మీకు హెడ్లైన్ ఇచ్చేశాను అని పలాశ్ బదులిచ్చాడు. అతడి మాటలతో ఇరువురి పెళ్లిపై స్పష్టత వచ్చేసింది. అయితే.. వరల్డ్ కప్‌లో ఆడతున్న మంధాన కూడా ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాపై రెండు శతకాలతో చెలరేగిన మంధాన ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డ్ విజేతగా నిలిచింది.
A run machine at the top! 👏
Congratulations to #TeamIndia vice-captain Smriti Mandhana on being named the ICC Women’s Player of the Month for September 2025! 🙌 @mandhana_smriti pic.twitter.com/iOIqwuq0MK
— BCCI Women (@BCCIWomen) October 16, 2025
ఈ ఏడాది జూలై 19, శనివారం ఈ డాషింగ్ ఓపెనర్ 29వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలాశ్ తన కలల రాణికి తన మనసుపుస్తకాన్ని ఆవిష్కరిస్తూ పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపాడు. మన ప్రయాణం మొదలైనప్పటి నుంచి నువ్వే నా ప్రశాంతత. నా కన్ఫ్యూజన్ కూడా. నా బిగ్గెస్ట్ చీర్ లీడర్ నువ్వే. నాలో స్ఫూర్తిని నింపేది కూడా నీవే. ఒత్తిడిలోనూ కూల్‌గా ఉండడం నిన్ను చూసే నేర్చుకున్నా. హ్యాపీ బర్త్ డే స్మృతీ’ అంటూ తన ప్రేమ సందేశాన్ని రాసుకొచ్చాడు. మనసైనోడి నుంచి విషెస్ అందుకున్న మంధాన.. నువ్వే నా హార్ట్ బీట్ అనే అర్ధం వచ్చేలా ‘థ్యాంక్యూ మై బాయ్’ అనే పోస్ట్‌కు లవ్ ఎమోజీలతో బదులిచ్చింది.
భారత ఓపెనర్‌గా అదరగొడుతున్న మంధాన రికార్డు బ్రేకర్ కూడా. మరోవైపు పలాశ్ సైతం కచేరీలు, సొంతంగా ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ పాపులర్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడైన అతడికి, మంధానతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి తరచూ వీళ్లు పార్టీల్లో కలుస్తుండేవాళ్లు. అలా ఒకరిమీద ఒకరికి 2019 లోనే ప్రేమ పుట్టింది. అలాగని తమ రిలేషన్‌షిప్‌ను ఇద్దరూ రహస్యంగానే ఉంచారు.
ఈ జంట 2013లో తొలిసారి దీపావళి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలోనే వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి. అయినా సరే మంధాన, పలశ్లు ఓపెన్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా ఇద్దరూ జంటగా కెమెరా కంట పడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రేయసికి పలాశ్ పియానో గురువుగా మారాడు. ఆ వీడియో అప్పట్లో కూడా బాగా వైరల్ అయింది.
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ (WPL 2024)లోనూ మెరుస్తున్న మంధాన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కలను సాకారం చేసింది. రెండో సీజన్లో ఆమె నేతృత్వంలోని ఆర్సీబీ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి విజతగా అవతరించింది. బెంగళూరు గెలుపొందిన అనంతరం జరిగిన సెలబ్రేషన్స్‌లో మంధానను పలాశ్ అభినందించి.. ప్రేమగా హత్తుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.