Watch: పోలీసుల ముందే ప్రొఫెసర్ చెంపపై కొట్టిన విద్యార్థిని.. వీడియో వైరల్
Student Slaps Professor | పోలీసుల ముందే ప్రొఫెసర్‌తో విద్యార్థిని ఘర్షణ పడింది. ఆయన చెంపపై ఆమె కొట్టింది. అయితే ఆ విద్యార్థిని చర్యను టీచర్స్ సంఘాలు ఖండించాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: పోలీసుల ముందే ప్రొఫెసర్‌తో విద్యార్థిని ఘర్షణ పడింది. ఆయన చెంపపై ఆమె కొట్టింది. (Student Slaps Professor) అయితే ఆ విద్యార్థిని చర్యను టీచర్స్ సంఘాలు ఖండించాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కాలేజీలో ఇటీవల విద్యార్థి మండలి ఎన్నికలు జరిగాయి. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు రెండు స్థానాలు గెలుచుకున్నారు.
కాగా, గెలిచిన ఎన్ఎస్యూఐ అభ్యర్థిపై ఏబీవీపీకి చెందిన వారు దాడి చేశారు. కాలేజీ క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ అయిన ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌కు ఈ దాడిపై ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) సంయుక్త కార్యదర్శి దీపికా ఝా, ఏబీవీపీ సభ్యులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్, వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన దీపిక అక్కడున్న పోలీసుల ముందే ప్రొఫెసర్ సుజిత్ కుమార్ చెంపపై కొట్టింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను పక్కకు తీసుకెళ్లారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రొఫెసర్‌పై విద్యార్థిని దాడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ సంఘం (డీయూటీఏ) ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ఆ విద్యార్థినిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాసింది.
ABVP की गुंडागर्दी अपने चरम पर!
DU के BR आंबेडकर कॉलेज में DUSU जॉइंट सेक्रेटरी दीपिका ने प्रिंसिपल रूम में प्रोफेसर को थप्पड़ मारा।
ये सब @DelhiPolice की मौजूदगी में हुआ!
CCTV में सब साफ़ दिख रहा है, फिर भी कार्रवाई नहीं!
ABVP की गुंडागर्दी पर सख़्त कार्रवाई हो। pic.twitter.com/ceGW3mb12H
— NSUI (@nsui) October 16, 2025
Also Read:
Dalit Man Urinated | అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు.. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన
Mamata Banerjee | సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

