కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee ) ఆలయాల నిర్మాణాలపై దృష్టిసారించారు. దిఘాలోని జగన్నాథ ఆలయం, కోల్‌కతా సమీపంలోని రాజర్‌హట్‌లో ప్రతిపాదిత దుర్గా ఆలయ నిర్మాణం తర్వాత సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. గురువారం డార్జిలింగ్‌లోని మహాకాల్ ఆలయాన్ని మమతా బెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. ‘సిలిగురిలోని ప్రతిపాదిత కన్వెన్షన్ సెంటర్ పక్కన పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం. పెద్ద శివలింగం ఉన్న అతిపెద్ద మహాకాళ ఆలయం ఇది. ఈ గుడి కోసం భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఆలయానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.
కాగా, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్పందించారు. సీఎం మమతా బెనర్జీని ఆయన విమర్శించారు. ‘2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు హిందువులు ఓటు వేయరని, బీజేపీకే వారు ఓటు వేస్తారని ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు. అందుకే ఆమె జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.
In times of adversity, it is faith that lights our path and gives us courage. Today, I had the privilege of visiting the sacred Mahakal Temple in Darjeeling, where I prayed for the health, peace, and prosperity of the people of Bengal and our nation at large.
May the divine… pic.twitter.com/hEaTKHppco
— Mamata Banerjee (@MamataOfficial) October 16, 2025
Also Read:
School Van Falls Off Bridge | వంతెన పైనుంచి పడిన వ్యాన్.. 10 మంది స్కూల్ పిల్లలకు గాయాలు
Son Poses As Maoist | మావోయిస్ట్ పేరుతో తండ్రిని బెదిరించి.. రూ.35 లక్షలు డిమాండ్ చేసిన కొడుకు