ముంబై: విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. (School Van Falls Off Bridge) మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సురేవారా ప్రాంతంలోని స్కూల్ పిల్లలు ఒక వ్యాన్లో ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
కాగా, ఆ రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో పెద్ద గుంతలను తప్పించేందుకు వ్యాన్ డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అదుపుతప్పిన ఆ వ్యాన్ వంతెన పైనుంచి కిందపడింది.
మరోవైపు ఆ వ్యాన్లో ప్రయాణించిన విద్యార్థుల్లో పది మంది గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్కు వారు చేరుకున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Gujarat ministers resign | గుజరాత్ మంత్రులంతా రాజీనామా.. రేపు మంత్రివర్గ విస్తరణ
Son Poses As Maoist | మావోయిస్ట్ పేరుతో తండ్రిని బెదిరించి.. రూ.35 లక్షలు డిమాండ్ చేసిన కొడుకు