భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన పిల్లల యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులు కనిపించాయి. (Worms In Antibiotic Syrup) ఇది చూసి ఒక చిన్నారి తల్లి షాక్ అయ్యింది. ఆ యాంటీబయాటిక్ సిరప్ బాటిల్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ సిరప్ స్టాక్‌ను సీజ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఒక చిన్నారిని మోరార్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి తీసుకెళ్లింది. పరీక్షించిన డాక్టర్, అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్ సూచించగా ఆసుపత్రి సిబ్బంది ఆ మందు ఇచ్చారు.
కాగా, ఇంటికి చేరుకున్న తర్వాత చిన్నారికి మందు వేసేందుకు అజిత్రోమైసిన్ సిరప్ మూతను ఆ మహిళ తెరిచింది. ఆ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులు కనిపించడంతో ఆమె షాక్ అయ్యింది. వెంటనే ఆ సిరప్ బాటిల్ తీసుకుని మోరార్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. తెరిచిన అజిత్రోమైసిన్ సిరప్ బాటిల్‌ను ఆసుపత్రికి సిబ్బందికి చూపించింది. ఈ సంఘటన కలకలం రేపింది.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుభూతి శర్మ స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని ఒక ఔషధ కంపెనీ ఆ అజిత్రోమైసిన్ సిరప్ తయారు చేసినట్లు తెలిపారు. మోరార్లోని ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేసిన ఆ యాంటీబయాటిక్ సిరప్ బాటిల్స్‌లో స్టాక్ ఉన్న 306 బాటిళ్లను రీకాల్ చేసినట్లు చెప్పారు.
కాగా, కొన్ని సిరప్ బాటిల్స్ పరిశీలించగా వాటిలో పురుగు అవశేషాలు లేవని డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుభూతి శర్మ తెలిపారు. అయితే టెస్టింగ్ కోసం కొన్ని మందు సీసాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ ఔషధం నమూనాలను కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీకి కూడా పంపనున్నట్లు ఆమె వెల్లడించారు.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ వల్ల కిడ్నీలు పాడైన కారణంగా 24 మంది పిల్లలు మరణించారు. మరింత మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా పిల్లల యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులు కనిపించిన సంఘటన ఆందోళన కలిగిస్తున్నది.
Also Read:
Stealing Newborn | ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ.. తల్లి, కుమార్తె అరెస్ట్
Employee Flees With Railways’ Rs 70 Lakh | రూ.70 లక్షల రైల్వే డబ్బుతో.. ఉద్యోగి పరార్
Watch: ఏనుగు తోక లాగిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?