కోల్కతా: ఒక వ్యక్తి సరదా కోసం ఏనుగు తోక లాగాడు. దానిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. (Man Pulls Elephant’s Tail) దీంతో ఆ ఏనుగు అతడిపై దాడికి యత్నించింది. అయితే దూరంగా ఉన్న కొందరు వ్యక్తులు దానిపైకి రాళ్లు విసిరారు. మరింతగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్లోని మెదినీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు ఆహారం కోసం అటవీ సమీప గ్రామాల్లో సంచరించాయి. కొందరు వ్యక్తులు వాటిని చూశారు.
కాగా, ఎత్తైన రోడ్డుపై ఉన్న ఏనుగు వెనుక వైపునకు ఒక వ్యక్తి వెళ్లాడు. సరదా కోసం దాని తోక పట్టుకుని లాగాడు. ఆ ఏనుగును రెచ్చగొట్టేందుకు అతడు ప్రయత్నించాడు. ఆగ్రహించిన అది అతడిపై దాడికి ప్రయత్నించగా తప్పించుకున్నాడు. అయితే దూరంగా ఉన్న మరికొందరు వ్యక్తులు ఆ ఏనుగుపై రాళ్లు రువ్వారు. దానిని మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ‘స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే’ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఏనుగును రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై నెటిజన్లు మండిపడ్డారు. అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు.
Also Read:
Watch: ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి.. ఎందుకంటే?
Stealing Newborn | ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ.. తల్లి, కుమార్తె అరెస్ట్