భోపాల్: హైకోర్టు సీనియర్ న్యాయవాది, ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె సనాతన వ్యతిరేకి అని ఆయన ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. అయితే ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి కూడా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఆయన వాదన తప్పని అన్నారు. (Muslim woman cop shouts Jai Shri Ram) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. ఒక హనుమంతుడి గుడి వద్ద నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ మిశ్రా, హిందూ సంఘాల వ్యక్తులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామాయణ పారాయణం కోసం టెంట్, ఇతర సామగ్రిని తెప్పించారు.
కాగా, చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హీనా ఖాన్ తన పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. నిషేధిత ఉత్తర్వుల నేపథ్యంలో న్యాయవాది అనిల్ మిశ్రా నేతృత్వంలో పారాయణ కార్యక్రమాన్ని ఆమె అడ్డుకున్నారు. అయితే ముస్లిం అయిన ఆ పోలీస్ అధికారిణి సనాతన వ్యతిరేకి అని అనిల్ మిశ్రా ఆరోపించారు. జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు.
మరోవైపు పోలీస్ అధికారిణి హీనా ఖాన్ కూడా ప్రతిగా జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ‘జై శ్రీరామ్ నినాదాల వల్ల నాపై ఒత్తిడి వస్తుందని మీరు అనుకుంటే, మీరు పొరపడినట్లే’ అని అనిల్ మిశ్రాతో ఆమె అన్నారు. తన డ్యూటీ తాను చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In MP’s Gwalior, advocate Anil Mishra wanted to encroach road for b’day celebration. Police confronted.
Anil Mishra: This is against Sanatan Jai Shri Ram!
Then comes the surprise b’day gift
DSP Hina Khan: Jai Shri Ram, Jai Jai Shree Ram, Jai Jai Shree Ram…anything else? pic.twitter.com/gKMVkUKHPC
— Piyush Rai (@Benarasiyaa) October 15, 2025
Also Read:
Watch: శరీరానికి సంచులు చుట్టుకొని గంజాయి అక్రమ రవాణా.. రైల్వే పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?