లక్నో: ఒక వ్యక్తి ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించాడు. తన స్నేహితుడితో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్ వద్దకు వెళ్లాడు. ప్రొపర్టీ డీలర్‌ను కలిసి మాట్లాడాడు. అయితే ఆ బిల్డింగ్ 31వ అంతస్తు నుంచి కిందపడి అతడు మరణించాడు. (Man Falls From 31st Floor) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 27 ఏళ్ల సత్యం త్రిపాఠి సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇందిరపురంలో నిర్మించిన సాయా గోల్డ్ అవెన్యూ సొసైటీలోని ఒక ఎత్తైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయాలని అతడు భావించాడు.
కాగా, ఆదివారం రాత్రి 8 గంటలకు సత్యం త్రిపాఠి తన స్నేహితుడు కార్తీక్ సింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ఫ్లాట్ చూడటానికి ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ వద్దకు వెళ్లాడు. ఆ ముగ్గురు సుమారు 50 నిమిషాలు అక్కడ ఉండి మాట్లాడుకున్నారు. ఇంతలో సత్యం త్రిపాఠి ఉన్నట్టుండి బిల్డింగ్ 31వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సత్యం త్రిపాఠి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు.
కాగా, స్థిరాస్తి డీలర్‌ను సత్యం తొలిసారి కలిశాడని పోలీస్ అధికారి తెలిపారు. ఇది ప్రమాదమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అన్నది నిర్ధారించేందుకు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Sonia Gandhi | వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ
Man Rapes School Girl | స్కూల్ టాయిలెట్లో దాక్కొని.. బాలికపై వ్యక్తి అత్యాచారం
Watch: రైల్వే ట్రాక్ దాటుతుండగా బైక్ పైనుంచి పడిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?