సిమ్లా: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఆ రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. కుమార్తె ప్రియాంక గాంధీ కూడా సోనియా వెంట ఉన్నారు. ఆదివారం సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో వీరభద్ర సింగ్ విగ్రహాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించారు. ప్రియాంక గాంధీ, వీరభద్ర సింగ్ భార్య, కుమారుడు, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. వీరభద్ర సింగ్‌ను ‘హిమాచల్ ఆత్మ’గా అభివర్ణించారు. ‘నేడు దేశంలో వీరభద్ర సింగ్ లాంటి నిజమైన నాయకుల కొరత ఉన్నది. ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఒక మాధ్యమం. అధికారం అంటే బాధ్యత అని భావించే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల సంప్రదాయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు’ అని అన్నారు.
మరోవైపు ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ‘హిమాచల్‌లో ఇల్లు ఉన్నందుకు నాకు గర్వంగా ఉన్నది. ఈ భూమి మాకు ప్రేమ, ప్రేరణను ఇస్తుంది’ అని అన్నారు.
కాగా, తన తండ్రి అసంపూర్ణ కలలను నెరవేర్చి హిమాచల్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తానని వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఈ సందర్భంగా తన తండ్రి విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేశారు.
#WATCH | Shimla, Himachal Pradesh: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, MP Priyanka Gandhi Vadra, Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu, and other Congress leaders attended the statue unveiling ceremony of former Himachal Pradesh Chief Minister Virbhadra… pic.twitter.com/tFJzCEWRHg
— ANI (@ANI) October 13, 2025
Also Read:
Akhilesh Yadav | యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారుడు.. ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపండి: అఖిలేష్ యాదవ్
Man Rapes School Girl | స్కూల్ టాయిలెట్లో దాక్కొని.. బాలికపై వ్యక్తి అత్యాచారం
Watch: రైల్వే ట్రాక్ దాటుతుండగా బైక్ పైనుంచి పడిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?