లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చొరబాటుదారుడని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని అన్నారు. ఆదివారం రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా లక్నోలోని లోహియా పార్క్‌ను అఖిలేష్ యాదవ్ సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
కాగా, వలసదారులకు సంబంధించి బీజేపీ వద్ద నకిలీ గణాంకాలున్నాయని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ‘కొందరు వ్యక్తులు వలసల గణాంకాలు ఇస్తున్నారు. మనకు కూడా యూపీలో చొరబాటుదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి (ఆదిత్యనాథ్) ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మేం ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపాలనుకుంటున్నాం. బీజేపీలో చొరబాటుదారులు ఉన్నారా లేదా చెప్పండి మరి?’ అని అన్నారు.
మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సభ్యుడు కాదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘ఆయన (ఆదిత్యనాథ్) చొరబాటుదారుడే కాదు. సైద్ధాంతిక కోణంలో కూడా చొరబాటుదారుడు. ఆయన బీజేపీ సభ్యుడు కాదు. మరొక (పార్టీ) సభ్యుడు. కాబట్టి, ఈ చొరబాటుదారులను ఎప్పుడు తొలగిస్తారు?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Lucknow, Uttar Pradesh: Samajwadi Party chief Akhilesh Yadav says, “…The BJP has fake statistics. If you believe the BJP’s statistics, you will be ruined. We have infiltrators here, too, in Uttar Pradesh. The Chief Minister is from Uttarakhand. We want him to be sent… pic.twitter.com/8XKWg3Vlw5
— ANI (@ANI) October 13, 2025
Also Read:
tribal girls gang raped | గిరిజన బాలికలను కిడ్నాప్ చేసి.. అడవికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
Watch: లోకల్ ట్రైన్లో సీటు దొరకలేదని.. ప్రయాణికులపై కారం చల్లిన మహిళ