tribal girls gang raped | గిరిజన బాలికలను కిడ్నాప్ చేసి.. అడవికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
tribal girls gang raped | గిరిజన బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాంచీ: గిరిజన బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (tribal girls gang raped) జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నగరి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు నవరాత్రి ఉత్సవాల రోజున తెలిసిన యువకులతో కలిసి స్థానిక జాతరకు వెళ్లారు.
కాగా, వారు తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ముగ్గురు బాలికలను వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ప్రతిఘటించిన యువకులను కొట్టి అక్కడి నుంచి తరిమారు. ఒక బాలిక వేడుకోగా ఆమెను వదిలేశారు. మిగతా ఇద్దరు బాలికలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు మరునాడు అక్కడి నుంచి బయటపడిన బాధిత బాలికలు తమ ఇళ్లకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
కాగా, మందీష్ యాదవ్, శంకర్ యాదవ్, ఓం ప్రకాష్ యాదవ్, మరో గుర్తు తెలియని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: విద్యార్థిని చుట్టుముట్టి కొట్టిన పోలీసులు.. గాయాలతో మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

