భోపాల్: కుల వివక్షకు సంబంధించిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణ వ్యక్తిని అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా వెనుకబడిన తరగతుల కమ్యూనిటీ (ఓబీసీ)కి చెందిన వ్యక్తితో అతడి పాదాలు కడిగించి ఆ నీరు తాగించారు. (Man Made To Wash Brahmin’s Feet) దీంతో కుల రాజకీయ దుమారానికి ఇది దారి తీసింది. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సతారియా గ్రామంలో మద్యాన్ని నిషేధించారు. అయితే బ్రాహ్మణ వర్గానికి చెందిన అన్ను పాండే మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడు. దీంతో గ్రామస్తులు అతడితో బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. రూ.2,100 జరిమానా విధించగా అతడు చెల్లించాడు.
కాగా, అదే గ్రామంలో నివసించే ఓబీసీ వర్గానికి చెందిన పరుషోత్తం కుష్వాహా ఏఐతో అన్ను మెడలో చెప్పుల దండ ఉన్నట్లుగా ఫొటో సృష్టించాడు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ ఫొటోను తొలగించాడు. క్షమాపణ కూడా చెప్పాడు. అయితే పరుషోత్తం చర్యను బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినట్లుగా ఆ వర్గం వారు భావించారు. దీంతో ఆ గ్రామంలో కుల వివాదంగా ఇది మలుపు తిరిగింది.
ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సమాజ సమూహం సమావేశమైంది. తన చర్యకు పర్షోత్తం ‘ప్రాయశ్చిత్తం’ చేసుకోవాలని, అన్ను పాదాలు కడిగి ఆ నీరు తాగాలని డిమాండ్ చేసింది. ఆ వర్గం ఒత్తిడి వల్ల పర్షోత్తం అన్ను పాదాలు కడిగి ఆ నీరు తాగాడు. అతడికి విధించిన రూ. 5,100 జరిమానా కూడా చెల్లించాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కులపరమైన రాజకీయ వివాదానికి ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు రెండు వర్గాల వారు ప్రయత్నించారు. ‘నేను తప్పు చేశాను. క్షమాపణ చెప్పాను. అన్ను పాండే నా కుటుంబానికి గురువు. దయచేసి దీనిని రాజకీయంగా మార్చవద్దు’ అని పర్షోత్తం ఒక వీడియోలో కోరాడు.
కాగా, తమ మధ్య గురు-శిష్య సంబంధం ఉన్నదని, కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని అన్ను పాండే ఆరోపించాడు. అయితే కుష్వాహా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. వర్గాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే చర్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
#Casteism The terror of casteist Manuvadi mindset is rising. In Damoh district, Madhya Pradesh, a young OBC man was forced by Brahmins to wash their feet and drink that water. These so-called “civilized” people still see SC, ST, and OBCs as “Shudras” and “untouchables.” pic.twitter.com/oozr6N2SMP
— The Dalit Voice (@ambedkariteIND) October 12, 2025
Also Read:
Karwa Chauth with two wives | ఇద్దరు భార్యలతో కలిసి.. కర్వా చౌత్ జరుపుకున్న వ్యక్తి
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Watch: మహిళ చెంపపై కొట్టిన ఎంఎన్ఎస్ కార్యకర్త.. తన భర్తను దూషించి దాడి చేసిందని ఆరోపణ