ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మహిళా కార్యకర్త ఒక మహిళ చెంపపై కొట్టింది. (MNS Worker Slaps Woman) తన భర్తను దూషించి దాడి చేయడంతోపాటు మరాఠా ప్రజలను అవమానించినట్లు ఆరోపించింది. తన భర్తకు క్షమాపణ చెప్పించడంతో పాటు ఆ మహిళను హెచ్చరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్వా రైల్వే స్టేషన్లో రద్దీగా ఉన్న లోకల్ రైలు నుంచి ఒక వ్యక్తి కిందకు దిగుతుండగా మహిళను ఢీకొట్టాడు. ఆమెకు అతడు క్షమాపణ చెప్పాడు.
కాగా, ఆ మహిళ ఆ వ్యక్తిపై ఆగ్రహించింది. అతడ్ని తిట్టడంతోపాటు చెంపపై కొట్టింది. కాలర్ పట్టుకుని దాడి చేయడంతోపాటు మరాఠీ ప్రజలను అవమానించేలా ఆమె మాట్లాడినట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు.
మరోవైపు ఆ వ్యక్తి భార్య, రాజ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంఎన్ఎస్ మహిళా కార్యకర్త స్వర ఘాటే ఆ మహిళను కల్వాలోని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెతో తన భర్తకు క్షమాపణలు చెప్పించింది. ఆ తర్వాత ఆ మహిళ చెంపపై కొట్టింది. ‘మళ్ళీ ఎప్పుడూ మహారాష్ట్ర ప్రజలను అలా అనవద్దు. నీకు అర్థమైందా?’ అని హెచ్చరించింది.
కాగా, ఎంఎన్ఎస్ మహిళా కార్యకర్త స్వర ఘాటే తన చర్యను సమర్థించుకున్నది. ‘ఒక మహిళ పురుషుడిపై చేయి ఎత్తింది. అతడు ఏమీ అనలేదు. ఆమె నా భర్తను అరగంట పాటు దుర్భాషలాడుతూనే ఉంది. కానీ నేను ఆమెతో ఏమీ అనలేదు. చట్టం మహిళలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుంది? నేను ఆమెపై కేసు నమోదు చేయాలని అనుకున్నా. అయితే ఆమె కుమార్తె, కుటుంబాన్ని చూసి ఆమెను వదిలేస్తున్నా’ అని అన్నది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు సుప్రియా సులే స్పందించారు. ఈ సంఘటనను ఆమె ఖండించారు. ‘పోరాటం, గొడవలు చేయడం మంచిది కాదని నేను అందరినీ అభ్యర్థిస్తున్నా. పోలీసులు దర్యాప్తు చేయాలి. దేశం ఇలా నడవదు. రాజ్యాంగం ప్రకారం మాత్రమే దేశం నడుస్తుంది. పోరాటం, గొడవల ద్వారా కాదు’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
MNS दफ्तर में थप्पड़! महिला से जबरन माफी मंगवाई
◆ MNS कार्यकर्ता स्वरा कटे ने ट्रेन में धक्का-मुक्की करने वाली महिला को MNS ऑफिस में बुलाकर माफी मंगवाई
◆ घटना का वीडियो सोशल मीडिया पर वायरल#MNS | #MaharashtraNavNirmanSena | #ViralVideo pic.twitter.com/u2ky4ZX65F
— News24 (@news24tvchannel) October 12, 2025
Also Read:
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Karwa Chauth with two wives | ఇద్దరు భార్యలతో కలిసి.. కర్వా చౌత్ జరుపుకున్న వ్యక్తి