షిల్లాంగ్: ఒకచోట వదిలేసిన బ్యాగును స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ చేయించారు. అందులో పేలుడు పదార్థాలు ఉండటంతో అంతా షాక్ అయ్యారు. (Explosives In Bag) మేఘాలయలోని రి భోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఉమిస్నింగ్లోని నివాసితుల ప్రాంతంలో అనుమానాస్పదంగా బ్యాగు వదిలేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, రి భోయ్ జిల్లా పోలీసులు స్పందించారు. షిల్లాంగ్‌లోని స్పెషల్ బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బ్యాగును తనిఖీ చేయగా అందులో ఐఈడీ ఉన్నట్లు గుర్తించారు. ఆ పేలుడు పరికరాన్ని విజయవంతంగా నిర్వీర్యం చేశారు. దర్యాప్తు కోసం ఉమిస్నింగ్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు తరలించారు.
మరోవైపు ఆ పేలుడు పదార్థాన్ని అమర్చినట్లు భావిస్తున్న నిందితుడిని గుర్తించినట్లు రి భోయ్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. బాంబ్ బ్లాస్ట్‌కు అతడు కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. బ్యాగులో ఉంచిన ఐఈడీని బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేయడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని వెల్లడించారు.
Also Read:
Man Kills Mother | ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కొడుకు.. ఆత్మహత్యగా నమ్మించేందుకు యత్నం
Karwa Chauth with two wives | ఇద్దరు భార్యలతో కలిసి.. కర్వా చౌత్ జరుపుకున్న వ్యక్తి