లక్నో: ఒక వ్యక్తి తన ఇద్దరు భార్యలతో కలిసి కర్వా చౌత్ జరుపుకున్నాడు. ఇద్దరు భార్యలు కలిసికట్టుగా ఉపవాసం ఆచరించారు. భర్తను పూజించారు. (Karwa Chauth with two wives) ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎత్మద్దౌలా ప్రాంతంలో నివసించే రాంబాబు నిషాద్కు పదేళ్ల కిందట షీలా దేవితో వివాహం జరిగింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు.
కాగా, కొంతకాలం తర్వాత మన్ను దేవిని రాంబాబు ప్రేమించాడు. అతడి భార్య షీలా దేవికి ఇది తెలిసింది. అయినప్పటికీ వీరిద్దరి సంబంధంపై ఆమె ఎలాంటి గొడవ చేయలేదు. ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పైగా ఈ ముగ్గురు ఒక అవగాహనకు వచ్చారు. దీంతో ఒక గుడిలో మన్ను దేవిని రాంబాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. నాటి నుంచి ఇద్దరు భార్యలతో కలిసి అతడు జీవిస్తున్నాడు.
Man Celebrates Karwa Chauth
మరోవైపు ప్రేమ, భక్తికి సంబంధించిన వేడుక అయిన కర్వా చౌత్ను రాంబాబు ఇద్దరు భార్యలైన షీలా దేవి, మన్ను దేవి కలిసికట్టుగా జరుపుకున్నారు. రోజంతా ఉపవాసం ఉన్నారు. భర్త రాంబాబును పూజించారు. అతడి చేతుల మీదుగా నీరు తాగి ఉపవాసాన్ని ముగించారు. అయితే ప్రేమ ఉన్నచోట గొడవలకు చోటు ఉండదని ఈ సందర్భంగా రాంబాబు అన్నాడు. ఇద్దరు భార్యలతో కలిసి అతడు కర్వా చౌత్ జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read:
Man Kills Mother | ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కొడుకు.. ఆత్మహత్యగా నమ్మించేందుకు యత్నం
Watch: మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్న రైల్వే పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?