న్యూఢిల్లీ: రైలులో ప్రయాణిస్తున్న మహిళ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను రైల్వే పోలీస్ అధికారి లాక్కున్నారు. దీంతో ఆమె షాక్ అయ్యింది. (Railway Cop Snatches Woman’s Mobile Phone) అయితే విండో వద్ద కూర్చొన్న ఆ మహిళకు స్నాచింగ్ సంఘటనలపై ఆయన జాగ్రత్తలు చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారి రితు రాజు చౌదరి, రైలులో నిర్లక్ష్యంగా ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలికి గుణపాఠం చెప్పారు. విండో వద్ద కూర్చొన్న ఆమె అప్రమత్తంగా లేకపోవడాన్ని ఆయన గమనించారు. ఆ మహిళ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను ఆయన లాక్కున్నారు.
కాగా, ఆ మహిళా ప్రయాణికురాలు షాక్ అయ్యింది. అయితే తన మొబైల్ ఫోన్ లాక్కున్న వ్యక్తి రైల్వే పోలీస్ అని తెలుసుకుని ఊరట చెందింది. నవ్వుతూ ఆయన చేతిలో ఉన్న తన మొబైల్ ఫోన్ను ఆమె తిరిగి తీసుకున్నది.
మరోవైపు రైల్వే స్టేషన్లలో నిత్యం జరిగే స్నాచింగ్ సంఘటనలపై ఆర్పీఎఫ్ అధికారి రీతు రాజు చౌదరి ఆ మహిళను అలెర్ట్ చేశారు. రైలు కంపార్ట్మెంట్లోని విండో సీటు వద్ద కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
A video showing a policeman snatching a woman’s phone through a train window to warn her against theft has gone viral. The officer immediately returned the phone and advised her to stay alert while travelling. The creative awareness act has earned widespread praise online, with… pic.twitter.com/41vPNnMBpB
— Mid Day (@mid_day) October 11, 2025
Also Read:
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర
Watch: ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?