పాట్నా: నెలలోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. (Bihar Elections) అయితే ఓటర్ల జాబితాపై ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయి. తాము మరణించినట్లుగా ఓటరు జాబితాలో చూపడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము బతికే ఉన్నామంటూ ఎన్నికల అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ధోరైయా బ్లాక్‌లోని బట్సర్ గ్రామానికి చెందిన ఐదుగురు నివాసితులు మరణించినట్లుగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్కొన్నారు. ఇది చూసి ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
కాగా, గ్రామంలోని బూత్ నంబర్ 216 నివాసితులైన మోహన్ సా, సంజయ్ యాదవ్, రాంరూప్ యాదవ్, నరేంద్ర కుమార్ దాస్, విశ్వవర్ ప్రసాద్ కలిసి బీడీవో అరవింద్‌ను శుక్రవారం కలిశారు. తాము బతికే ఉన్నామని, ఓటరు జాబితాలో తమ పేర్లు చేర్చాలంటూ వినతిపత్రం అందజేశారు.
మరోవైపు వారి ఫిర్యాదుపై బీడీవో అరవింద్ స్పందించారు. ఫారం-6 నింపి వారి పేర్లను తిరిగి ఓటరుగా నమోదు చేయాలని బీఎల్వోకు సూచించారు. అర్హత ఉన్న ఏ ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోరని ఆయన అన్నారు.
Also Read:
Road Accident | తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుమారుడితో సహా ముగ్గురు మృతి
Watch: ఏడాదిన్నర కుమార్తెను కిడ్నాప్ చేసిన తండ్రి.. వీడియో వైరల్