జైపూర్: ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను ఆమె తండ్రి కిడ్నాప్ చేశాడు. (Father Kidnaps Daughter) పుట్టింట్లో ఉంటున్న భార్య వద్ద ఉన్న ఆ చిన్నారిని అపహరించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హేమంత్ సోని, ఆకాంక్ష దంపతులకు 2022 నవంబర్‌లో వివాహమైంది. ఏడాదిన్నర వయస్సున్న కుమార్తె వంశిక వారికి ఉన్నది.
కాగా, భర్త హేమంత్ వేధింపులు భరించలేని ఆకాంక్ష తన కుమార్తెతో కలిసి జుంజునులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత రెండేళ్లుగా తండ్రి ఇంట్లో ఆమె నివసిస్తున్నది. భార్యాభర్తల మధ్య గొడవకు సంబంధించిన కేసు విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
మరోవైపు అక్టోబర్ 9న గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆకాంక్ష తన కుమార్తెను ఇంటి ముందు ఆడించింది. కొద్దిసేపు ఇంట్లోకి ఆమె వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా కుమార్తె అదృశ్యమైంది.
ఆందోళన చెందిన ఆకాంక్ష, ఆమె తండ్రి కలిసి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. భర్త హేమంత్ కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో భర్తపై ఆకాంక్ష ఫిర్యాదు చేసింది. కుమార్తెను తీసుకెళ్తానంటూ కొన్ని నెలలుగా అతడు బెదిరిస్తున్నట్లు ఆరోపించింది.
కాగా, కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు హేమంత్ కోసం వెతుకున్నారు. అతడి వద్ద ఉన్న చిన్నారిని క్షేమంగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే తండ్రి తన కుమార్తెను కిడ్నాప్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
झुंझुनूं में ढाई साल की बच्ची का अपहरण…पिता ही निकला आरोपी#RajasthanNews pic.twitter.com/qr9ZF1xCWk
— Mangal Yadav (@MangalyYadav) October 10, 2025
Also Read:
Road Accident | తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుమారుడితో సహా ముగ్గురు మృతి
Woman films neighbour | నగ్నంగా మారి పొరుగు వ్యక్తి గొడవ.. వీడియో రికార్డ్ చేసిన మహిళపై దాడి
Watch: ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?